వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ 2020 పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. పరీక్షల ఏర్పాట్లు, ప్రశ్న పత్రాల ఓపెన్ విధానాన్ని పరిశీలించారు. ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు.
16 సెంటర్లకు 6,758 మంది అభ్యర్థులను కేటాయించగా.. 3,330 మంది హాజరయ్యారని, 3,428 మంది గైర్హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు.