ETV Bharat / state

సిటిజన్​ ట్రాకింగ్​ యాప్​తో మరింత కఠినంగా లాక్​డౌన్​

లాక్​డౌన్​ మరింత పటిష్టంగా అమలు చేసేందుకు వరంగల్​ పోలీసులు సిటిజన్​ ట్రాకింగ్​​ యాప్ వినియోగిస్తున్నారు. వాహనదారులు మూడు కిలోమీటర్లు దాటి ప్రయాణం చేస్తే ఈ యాప్ ద్వారా వారిపై కేసు నమోదు చేయటం సహా జరిమానా విధిస్తామని వరంగల్ ఏసీపీ ప్రతాప్ తెలిపారు.

citizen app in warangal
సిటిజన్​ యాప్​తో మరింత కఠినంగా లాక్​డౌన్​
author img

By

Published : Apr 10, 2020, 1:04 PM IST

లాక్​డౌన్​ పటిష్టంగా అమలు చేసేందుకు వరంగల్​ పోలీసులు నూతనంగా సిటిజన్​ ట్రాకింగ్ యాప్​ వినియోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్ శాఖ ఈ యాప్​ను రూపొందించింది. వాహనదారులు మూడు కిలోమీటర్ల దాటి ప్రయాణం చేస్తే ఈ యాప్ ద్వారా వారిపై కేసు నమోదు చేయటం, జరిమానా విధింపు ఉంటుందని వరంగల్ ఏసీపీ ప్రతాప్ తెలిపారు.

రెండు రోజుల వ్యవధిలో 149 ద్విచక్ర వాహనాలు, 110 ఆటోలను సీజ్ చేసి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్​లోని పార్కింగ్ స్థలాలకు తరలించారు. చెక్​ పాయింట్​ వద్ద వాహన వివరాలు యాప్​లో నమోదు చేస్తారు. మరో చెక్​ పాయింట్​ వద్ద వాహన వివరాలు ఎంటర్​ చేస్తారు. 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే జరిమానా విధిస్తారు. పదే పదే తిరిగినా యాప్​ పట్టేస్తుందని ఏసీపీ తెలిపారు. అందువల్ల ఎవరూ అనవసరంగా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు.

సిటిజన్​ యాప్​తో మరింత కఠినంగా లాక్​డౌన్​

ఇదీ చూడండి: 'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.