ETV Bharat / state

వరంగల్​ నిట్​లో చిట్టడవి.. ఎలా సాధ్యమైందో తెలుసా..? - వరంగల్​ నిట్​ తాజా వార్తలు

పర్యావరణం బాగుంటేనే సమాజం బాగుంటుంది. ప్రకృతికి హాని కలిగితే అది మానవాళికే ముప్పుగా పరిణమిస్తుంది. భావితరాలు కాలుష్యంలో చిక్కి శల్యమైపోతాయి. విపరీత ఉష్ణోగ్రతలతో మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఈ ముప్పు తప్పాలంటే మొక్కలు విరివిగా నాటాలి. వాటి సంరక్షణను సామాజిక ఉద్యమంగా చేపట్టాలి. ఆ స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం హరితహారం ద్వారా ఆచరణలో చూపిస్తోంది. దాన్ని అక్షరాలా పాటిస్తోంది వరంగల్​ నిట్​.

chittadavi in Warangal nit
వరంగల్​ నిట్​లో చిట్టడవి.. ఎలా సాధ్యమైందో తెలుసా..?
author img

By

Published : Jul 13, 2020, 12:13 PM IST

నిన్నటిదాకా చిన్న చిన్న మొక్కలే. ఏడాది దాటకుండానే ఆ ప్రదేశం చిట్టడవిని తలపిస్తోంది. ప్రతిష్ఠాత్మక జాతీయ సాంకేతిక విద్యాసంస్థ యాజమాన్యం వరంగల్​లో 8 నెలల క్రితం చేపట్టిన మియావాకి విధానం సత్ఫలితాలనిస్తోంది. మొక్కలన్నీ ఆరడుగులు ఏపుగా పెరిగి విద్యాలయ ప్రాంగణమంతా పచ్చదనం పరుచుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హరితహారంలో భాగంగా మియావాకి విధానంలో తక్కువ విస్తీర్ణంలోనే నిట్​ నిర్వాహకుల ఎక్కువ మొక్కలు నాటారు. అటవీ శాఖ సహకారంతో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు గతేడాది ఆగస్టు 15న పెంచడం ప్రారంభించారు. రెండెకరాల్లోనే 6 వేల మొక్కలు ఏపుగా పెరిగి చిన్నపాటి అడవిలా కనువిందు చేస్తోంది.

మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకోకుండా ఆ మొక్కల సంరక్షణ బాధ్యతను విద్యార్థులు, అధ్యాపకులు తీసుకోవడం సత్ఫలితాలనిచ్చింది. చింత, రావి, వేప, మర్రి, ఉసిరి, సీతాఫలం, మామిడి, పారిజాతం, అల్లనేరేడు, ఆరె, పెద్దారె, కుంకుడు మొదలైన స్థానికంగా ఉండే 20 జాతుల మొక్కలు ఏపుగా పెరగడంతో పక్షుల కిలకిలరావాలు, సీతాకోకచిలుకల కొత్త అందాలు సందడి చేస్తున్నాయి.

ఇదే స్ఫూర్తితో రెండో దశకూ విద్యార్థులు, అధ్యాపక బృందం శ్రీకారం చుట్టింది. మరో ఎకరం విస్తీర్ణంలో మొక్కలు నాటి వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.

ఇదీచూడండి: కరోనా సంక్షోభంలోనూ ప్రగతి రథానికి సౌరశక్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.