వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట్ చౌరస్తాలో చిరువ్యాపారులతో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముచ్చటించారు. కాజీపేట్ ప్రధాన కూడలిలో వాహనదారులు, పాదచారుల రాకపోకలకు ఇబ్బందిగా మారిన చిరువ్యాపారుల దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు.
ఈ నేపథ్యంలో చిరువ్యాపారులు, మున్సిపల్, ట్రాఫిక్, సివిల్ అధికారులతో చీఫ్ విప్ చర్చించారు. చిరువ్యాపారుల దుకాణాలు రహదారిపై ఉండటం వల్ల ట్రాఫిక్‌కి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్, రైల్వే అధికారులతో సంప్రదించి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా దుకాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపిస్తానని చీఫ్ విప్ తెలిపారు.
ఇదీ చూడండి : మంత్రి గంగుల నిబంధన ఉల్లంఘించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు