కాళోజీ కళా క్షేత్ర నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాళోజీ కళా క్షేత్ర నిర్మాణ పనులను చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలోనే కాళోజీ కళాక్షేత్రం వైభవంగా విరాజిల్లనుందన్నారు.
కళాక్షేత్రం నిర్మాణానికి రూ.యాభై కోట్లు కేటాయించి నిర్మాణం చేపట్టామని... రవీంద్రభారతికి దీటుగా నిర్మిస్తామన్నారు. వేగవంతంగా నాణ్యతతో పనులను పూర్తి చేయాలని అధికారులను, గుత్తేదార్లను అదేశించారు. నిధుల కొరత లేకుండా... త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: టపాసుల కోసం వెళ్లి బాలుడు అదృశ్యం