కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కొనియాడారు. ఈ నెల 13న కాంగ్రెస్ నాయకులు చేసేది జలదీక్ష కాదని.. జలగల దీక్ష అని ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. గతంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ నాయకులు ధనయజ్ఞం చేసి ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రాజెక్టుల ద్వారా పంటలు పండి అటు రైతులు.. చెరువులు నిండి మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రిపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.
ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!