ప్రభుత్వ ఛీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెరాస ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రక్తదానం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రెడ్ క్రాస్‌లో ఎమ్మెల్యేతోపాటు తెరాస విద్యార్థి విభాగం విద్యార్థులు రక్తదానం చేశారు. కరోనా వైరస్ కారణంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అతి కొద్దిమంది సమక్షంలో జరుపుకున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు.
ఇదీ చూడండి: 'దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల్లో మెరుగుదల