వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి నూతన కార్యనిర్వహణాధికారిగా డాక్టర్ చంద్రశేఖర్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. గత కొన్ని రోజులుగా అనేక విమర్శలు ఎదుర్కొంటున్న నాగార్జున రెడ్డిని ఈవో పదవి నుంచి తొలగిస్తూ.. వైద్యారోగ్య సంచాలకులు ఉత్తర్వులు జారీ చేయడంతో నూతనంగా చంద్రశేఖర్ బాధ్యతలను స్వీకరించారు. కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో నాగార్జున రెడ్డి విఫలమయ్యారని అనేక ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను తొలగించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ చంద్రశేఖర్‌కు ఆస్పత్రి సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. గత కార్యనిర్వాహణాధికారి లోపాలను సవరిస్తూ రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు