ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దేవత అయిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకా బరీ ఉత్సవాలు రెండోరోజుకు చేరుకున్నాయి. ప్రతిఏటా అత్యంత వైభవోపేతంగా నిర్వహించే ఉత్సవాలు... ఈసారి కరోనా మహమ్మారి కారణంగా సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ఘనమైన పూజలు నిర్వహించేవారు. కానీ కొవిడ్ నిబంధనల కారణంగా... హంగు, ఆర్భాటాల్లేకుండా, ఎలాంటి అలంకరణ చేయకుండా మామూలుగానే పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి : జగన్నాథ రథయాత్ర చరిత్రలో తొలిసారి ఇలా...