ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ పట్టణ కేంద్రంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4కె రన్ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు, విద్యార్థులు, ట్రాఫిక్ ఏసీపీ ముజీబ్ పాల్గొన్నారు. క్యాన్సర్‌ను జయిద్దాం అంటూ నినాదాలు చేశారు. హన్మకొండలోని కాకతీయ దూరవిద్య కేంద్రం నుంచి అమరవీరుల కీర్తి స్థూపం వరకు పరుగు చేపట్టారు.
తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి దాని నుంచి బయటపడాలని అవగాహన కల్పించారు. ఏ మాత్రం అనుమానం ఉన్న ముందుగానే వైద్యులను సంప్రదించాలని సూచించారు.