ETV Bharat / state

Bogatha Waterfalls : బొగత జలపాతం పరవళ్లు.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జలధారలు

Bogatha Waterfalls Mulugu District : బొగత జలపాతం సరికొత్త అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఆదివారం సెలవురోజు కావటంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు విచ్చేశారు. చల్లని నీటిలో జలకాలాడుతూ సరదాగా గడిపారు. పాల నురగులా జాలువారుతున్న ప్రవాహాన్ని చూసి సందర్శకులు పరవశించిపోతున్నారు. కొండల పై నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జలధార పర్యాటకులకు కనులవిందు చేస్తోంది.

Bogatha Waterfalls Warangal
Bogatha Waterfalls Warangal
author img

By

Published : Jul 24, 2023, 7:57 AM IST

బొగత జలపాతం పరవళ్లు.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జలధారలు

Bogatha Waterfalls in Telangana : ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు.. బొగత జలపాతం సరికొత్త అందాలను సంతరించుకుంది. పాల నురుగులా జాలువారుతున్న ప్రవాహాన్ని చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు. రాష్ట్రంలోని పలుచోట్ల నుంచి భారీగా తరలివస్తున్న సందర్శకులు కొండల నుంచి పరుగున్న వస్తున్న జల సవ్వడిని చూసి తన్మయత్వంలో మునిగిపోతున్నారు.

Bogatha Waterfalls Mulugu : ములుగు జిల్లాలో.. తెలంగాణ నయాగారాగా పేరొందిన బొగత జలపాతం ప్రకృతి రమణీయత మధ్య ముగ్ధమనోహరంగా మారింది. చుట్టూ ఎత్తైన కొండలు.. దట్టమైన అడవి గుండా ప్రవహిస్తూ వస్తున్న జలపాతం అందాలను చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు. వరంగల్‌కి 133 కిలోమీటర్ల దూరంలో సహజసిద్ధ జలపాతాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి విశేషంగా తరలిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని జలపాతానికి.. ఈ ఏడు కాస్త ఆలస్యంగా జలకళ వచ్చింది. భారీ వర్షాలకు గంగమ్మ ధారలు బొగత కనుమల్లో కనువిందు చేస్తున్నాయి. పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చి బొగత సహజ అందాలను మనసారా ఆస్వాదిస్తూ మరిచిపోలేని మధురస్మృతులను మూటగట్టుకెళుతున్నారు.

Bogatha Waterfalls Visitors : కొండకోనల్లో నుంచి వడివడిగా పడుతూ నేలను తాకుతున్న జలధారలను చూసి మురిసిపోతున్నారు. కుటుంబసమేతంగా పిల్లాపాలతో విచ్చేసి.. సమీప జలాల్లో జలకాలాడుతూ సరదాగా గడుపుతున్నారు. నిత్యం ఉండే పనిఒత్తిడిని మరిచిపోడానికి బొగత జలపాతాన్ని చూస్తే సరిపోతుందని ఆనందంతో చెబుతున్నారు. అంత ఎత్తునుంచి దూకుతుంటే వస్తున్న జలసవ్వళ్లు.. ఆ తుంపరలను చూసి సాంత్వన పొందుతున్నారు.

"తెలంగాణలోనే పేరుగాంచిన జలపాతం ఇది. మేము ఇక్కడికి రావడం ఇది రెండోసారి. మొదటిసారి కొవిడ్ సమయంలో వచ్చాము. అప్పుడు ఇక్కడ అంత వాటర్ లేదు. స్నానం చేయటానికి కూడా కుదరలేదు. ఇప్పుడు ఇక్కడ చూడటానికి చాలా బాగుంది. తెలంగాణలోని మిగతా జలపాతాలతో చూసుకుంటే ఇక్కడ చాలా బాగుంది. వీకెండ్​లో ఇలా ఇక్కడికి రావడం నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ రోజు మొత్తం ఎంజాయ్ చాశాం. చూడటానికి కూడా లొకేషన్ చాలా బాగుంది. చుట్టూ కొండలు మధ్యలో జలధాలలు మంచిగా అనిపిస్తుంది." -పర్యాటకులు

మరోవైపు పర్యాటకులకు సౌకర్యంగా ఉండేందుకు జలపాతం వద్ద అటవీశాఖ అధికారులు స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు. అక్కడ స్నానాలు చేస్తూ పర్యాటకులు జలపాతాన్ని చూస్తూ సందడి చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో పరిసరాలు కోలాహాలంగా మారాయి. కొత్త అందాలతో తెలంగాణ నయాగారా చూపరులకు ఎంతగానో కనువిందు చేస్తోంది.

భారీ వర్షాలతో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ముత్యంధార జలపాతం నీటి సవ్వడిలతో స్వాగతం పలుకుతోంది. వాజేడు మండలం అరుణాచలపురానికి సమీపంలోని గుండం జలపాతం.. దానికి సమీపంలోనే ఉన్న గడి చెరువు జలపాతాలూ సందర్శకులను కట్టిపేడేస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.