ETV Bharat / state

ఓరుగల్లు గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం: బండి సంజయ్ - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​

వరంగల్​ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కోట్ల నిధులు మంజూరు చేస్తే తెరాస నాయకులు జేబులు నింపుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కబ్జాలు చేసే వాళ్లు కావాలా, అభివృద్ధి కావాలా ప్రజలే నిర్ణయించాలన్నారు. మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో రోడ్​ షో నిర్వహించారు.

BJP state president bandi sanjay
వరంగల్​లో ప్రచారం నిర్వహిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
author img

By

Published : Apr 27, 2021, 1:21 PM IST

నిధులిచ్చే వాళ్లు కావాలో.. కబ్జాలు చేసే వాళ్లు కావాలో వరంగల్ ప్రజలే తేల్చుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు గ్రేటర్ వరంగల్​లో ఆయన పర్యటించారు. ఓరుగల్లు గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

నగరంలోని పలు డివిజన్లలో భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. వేల కోట్ల రూపాయలను కేంద్రం ఇస్తేనే వరంగల్ అభివృద్ధి చెందిన విషయాన్ని నగరవాసులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అధికార తెరాస నాయకులు నిధులతో జేబులు నింపుకున్నారే తప్ప.. చేసింది శూన్యమని విమర్శించారు. అభివృద్ధి నినాదంతో భాజపా ముందుకెళ్తోందని తెలిపారు. ఒకసారి వరంగల్ బస్టాండ్, రైల్వేస్టేషన్​ను పరిశీలిస్తే ఎవరూ ఏం చేశారో తెలుస్తుందని బండి సంజయ్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.