ETV Bharat / state

'విపత్తు వేళ పేదలపై విద్యుత్ భారం మోపడం సరికాదు'

లాక్​డౌన్​ విద్యుత్​ మూడు నెలల విద్యుత్ బిల్లులు ఒకేసారి బలవంతంగా వసూలు చేయడం తగదని భాజపా నేతలు ఆరోపించారు. హన్మకొండ విద్యుత్​ భవన్​ ఎదుట ధర్నా నిర్వహించారు. విపత్తు వేళ ప్రజలపై భారం వేయడం ప్రభుత్వ వైఫల్యమే అని.. మాజీ ఎంపీ వివేక్​ అన్నారు.

Bjp Protest Against Electricity Bills In Hanmakonda
కరెంటు బిల్లులు మాఫీ చేయాలని భాజపా ధర్నా
author img

By

Published : Jun 15, 2020, 4:42 PM IST

కరోనా సమయంలో ప్రభుత్వం విధించిన అధిక విద్యుత్​ బిల్లులను నిరసిస్తూ వరంగల్‌ అర్బన్ జిల్లా హన్మకొండలో భాజాపా శ్రేణులు అందోళన చేపట్టాయి. విద్యుత్‌ బిల్లులను మాఫీ చేయాలని కోరుతూ హన్మకొండలోని విద్యుత్‌ భవన్‌ ఎదుట భాజాపా ధర్నా నిర్వహించారు. పేద ప్రజలపై భారం వేయకుండా వాటిని మాఫీ చేసి ప్రభుత్వమే భరించాలని డిమాండు చేశారు.

విపత్తు వేళ పేద ప్రజలపై విద్యుత్‌ భారం మోపడం ప్రభుత్వ వైఫల్యమే అని మాజీ ఎంపీ వివేక్​ ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం విద్యుత్​ బిల్లులు రద్దు చేయకపోతే.. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తమాని ఆయన హెచ్చరించారు. విద్యుత్‌ భవన్‌ ఎదుట ఆందోళణ చేస్తున్న భాజపా శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో పోలీసులకు భాజాపా నేతలకు తీవ్ర తోపులాట జరిగింది. విద్యుత్‌ బిల్లులతో పేద ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని.. ఇదేమని ప్రశ్నిస్తే.. అరెస్టు చేసి.. కేసులు పెడతారా అని మండిపడ్డారు.

ఇదీ చూడండి : కరీంనగర్​ కమిషనరేట్​లో లైసెన్సు రద్దు సెంచరీ దాటేసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.