ETV Bharat / state

'భాజపాను గెలిపించి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి' - telangana news

భాజపా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం హన్మకొండలో జరిగింది. ఈ కార్యక్రమంలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని భాజపా శ్రేణులకు బండి సంజయ్ దిశా నిర్ధేశం చేశారు.

BJP MLC election preparatory meeting was organized at Chaitanya Degree College in Hanmakonda.
'భాజపాను గెలిపించి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి'
author img

By

Published : Jan 9, 2021, 6:13 PM IST

భాజపా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. హన్మకొండలోని చైతన్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్​తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని భాజపా శ్రేణులకు బండి సంజయ్ దిశానిర్ధేశం చేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

గుణపాఠం చెప్పండి

సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు మాయమాటలు చెబుతూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రైవేటు టీచర్లు, అధ్యాపకులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపాను గెలిపించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని బండి సంజయ్‌ సూచించారు.

ఇదీ చదవండి: ఏప్రిల్​ నుంచి పూర్తి స్థాయిలో రుణమాఫీ : హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.