వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వివిధ కాలనీల్లో ఉంటున్న నిరుపేదలకు భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి తిరుగుతూ కూరగాయలు పంపిణీ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు లాక్‌డౌన్ కాలంలో 900 క్వింటాల కూరగాయలను పంపిణీ చేసినట్లు తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ... కరోనా మహమ్మారి భారీ నుంచి కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి: 'ప్లాస్మా చికిత్స' క్లినికల్ ట్రయల్స్‌కు లైన్ క్లియర్!