గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని భాజపా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం కడిపికొండ గ్రామంలోని 44వ డివిజన్ భాజపా అభ్యర్థి జలగం అనిత తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు.
గత ఎన్నికల్లో గెలిచిన తెరాస కార్పొరేటర్లు ఆర్థికంగా ఎదిగారే తప్ప... డివిజన్ల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. భాజపాను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. తెరాసపై ఉన్న వ్యతిరేకతే తమకు విజయాన్ని చేకూరుస్తుందని భాజపా అభ్యర్థి అభిప్రాయపడ్డారు.