రాష్ట్రంలో భాజాపా అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో భాజపా శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
జిల్లాలోని ఆర్ట్స్ కళాశాల మైదానానికి పొద్దుటే చేరుకున్న ప్రేమేందర్ రెడ్డి ఉదయం నడకకు వచ్చిన వారిని కలుస్తూ భాజాపా అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగ నియమాకాలు చేపట్టుకుండా నిరుద్యోగులను తెరాస ప్రభుత్వం నిలువునా ముంచిందని ఆరోపించారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ గ్రామీణ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ సహా ఇతర భాజపా శ్రేణులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ టీకాకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు:కిషన్ రెడ్డి