రాబోవు గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపునిచ్చారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో గ్రేటర్ వరంగల్ పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్, భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఇతర నేతలు హాజరయ్యారు.
రాష్ట్రంలో భాజపాకు ఆదరణ బాగా పెరిగిందని.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలే అందుకు నిదర్శనమని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రణాళిక బద్ధంగా పని చేస్తూ.. వరంగల్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చూడండి: 'సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామంలో రైతులతో ముఖాముఖి'