వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. స్వామి వారికి వినయ్ భాస్కర్ దంపతులు పంచామృతలతో అభిషేకాలు నిర్వహించారు.
ఈ పడిపూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప గీతాలు ఆలపిస్తూ భజనలు చేశారు. ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమోగింది. అనంతరం స్వాములకు ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ భోజనాలు వడ్డించారు.
ఇవీ చూడండి: 'మూసీ సుందరీకరణ కాదు.. శుద్ధీకరణ జరగాలి'