వరంగల్ పట్టణ జిల్లా రైతులు కూరగాయలు, పండ్లు, పూల సాగుకు మొగ్గు చూపాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని కృషి భవన్ లో నియంత్రిత పంట సాగుపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. నగరంలో కూరగాయల కొరత ఉందని.. దానికి అనుగుణంగా పట్టణ ప్రాంతలో ఉన్న రైతులు కూరగాయలు పండించి లాభాలు పొందాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వ్యవసాయం లాభసాటిగా మారాలి
కూరగాయలతో పాటు, పండ్లు, పూల సాగు చేయాలని ఎమ్మెల్యే కర్షకులకు సూచించారు. రైతులు పండించిన కూరగాయలను.. నగరంలో ఉన్న మాల్స్, దుకాణాలలో విక్రయాలు జరిగే విధంగా చొరవ తీసుకుంటామని తెలిపారు. గతంలో వ్యవసాయం దండగలా ఉండేదని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయం పండుగలా మారిందని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఒకే ఇంట్లో నలుగురికి కరోనా