కరోనా వైరస్ దరిచేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వరంగల్ పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. వరంగల్ అర్బన్ జిల్లా మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంజీయం కూడలిలో మాస్కులు ధరించటం, శానిటైజర్ వాడకం, భౌతిక దూరం, ఇతర జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
అనంతరం ప్రజలతో ప్రతిజ్ఞను చేయించారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ సిద్ధాంతమే సామాజిక న్యాయం: ఉత్తమ్