కరోనా వైరస్ రోజురోజుకు విస్తృతం అవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను చైతన్యమంతం చేయడానికి వరంగల్ నగరానికి చెందిన ఉపేందర్ రెడ్డి తయారు చేయించిన చిత్రాలను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో వైరస్‌పై అవగాహన కల్పించడానికి దోహదపడతాయని, ఇలాంటి వినూత్న ప్రక్రియలు ప్రజల్లో ఆలోచన ధోరణిని పెంపొందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధినిర్వహణలో ఉన్న సిబ్బందిని ప్రశంసించే విధంగా ఉన్న పోస్టర్ల ద్వారా పోలీసు సిబ్బందికి మనో నిబ్బరాన్ని కల్గిస్తాయని, వీటిని నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.