వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలకేంద్రం నుంచి పలువురు కూలీలు ఆటోలో కూలీ పనికోసం వెళ్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలో వెనక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పదిమందికి స్వల్ప గాయాలవ్వగా... ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నందున స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. వారు రానందున ఆటో డ్రైవర్ తన వాహనంలో వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండిః హాజీపూర్ గ్రామస్థుల నిరాహార దీక్ష భగ్నం