వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగం రెండో రోజు కొనసాగుతోంది. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జరుపుతున్న ఈ యాగం కన్నులపండువగా సాగుతోంది. 200 మంది రుత్వికులు పాల్గొని భక్తులకు అనుగ్రహన భాషణం చేశారు.
శృంగేరి పీఠం నుంచి వచ్చిన అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు కుంకుమ పూజలు చేసి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు.
ఇదీ చూడండి: 'సేవ్ ఎనర్జీ... సేవ్ ఎర్త్... సేవ్ వాటర్... సేవ్ లైఫ్'