ETV Bharat / state

ఆరోగ్య శ్రీ ఎఫెక్ట్.. రోగులతో కిక్కిరిసిన ఎంజీఎం... - ఎంజీఎం

ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో భారమైనా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుంటే... మరికొందరు సర్కార్ దవాఖానాలవైపు పరుగులు పెడుతున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రోగుల తాకిడి పెరుగుతోంది.

mgm hospital
author img

By

Published : Aug 20, 2019, 10:28 AM IST

బకాయిలు రావట్లేదంటూ నెట్​వర్క్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యసేవలను నిలిపివేయడం పేదలకు సంకటంగా మారుతోంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 40 ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ అమలవుతుండగా... తాజాగా సేవల బంద్​తో డబ్బులు పెట్టి చికిత్స చేయించుకోలేని రోగులంతా... వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వెళుతున్నారు. అక్కడ రోజు రోజుకీ రద్దీ పెరుగుతోంది. జ్వరాలతో వచ్చేవారూ దీనికి తోడవడం వల్ల వేయి పడకల ఎంజీఎం ఆసుపత్రి సరిపోని పరిస్థితి నెలకొంది. అదనపు పడకలు వేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చులు భరించలేక రోగులు నరకయాతన పడుతున్నారు. త్వరగా ఈ సమస్య పరిష్కారం కావాలని వేడుకుంటున్నారు.

ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడం వల్ల రోగుల ఇబ్బందులు

ఇదీ చూడండి: భూసంస్కరణలపై వేగం పెంచిన సర్కార్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.