వరంగల్ అర్బన్ జిల్లా నర్సంపేట మండలం బాంజీపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 3వ సబ్ సెంటర్‌లో ఏఎన్‌ఎం వేధింపులు భరించలేక ఆశా వర్కర్ రమ ఆత్మహత్యకు యత్నించింది. తోటి ఆశా వర్కర్లు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. 3వ సబ్ సెంటర్‌లో ఏఎన్ఎంగా పనిచేస్తున్న రజిత తనను గత కొద్ది రోజులుగా మానసికంగా వేదిస్తోందని.. ఆ వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు బాధితురాలు తెలిపింది.
ఇదీ చూడండి: ఆధునిక యుగంలో గాంధీ సిద్ధాంతాలతో పనేంటి?