anchor suma in temple: ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సుమకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జయమ్మ పంచాయతీ సినిమా విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. దర్శనానంతరం అర్చకులు ప్రసాదాలతో పాటు వస్త్రాలను అందజేశారు. ఆలయానికి వచ్చిన సుమతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
బుల్లితెర వ్యాఖ్యాతగా ఎన్నో లక్షల మంది హృదయాలను గెలుచుకున్న సుమ.. మరోసారి వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది. మే 6న చిత్రం రిలీజ్ కానుంది. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె వెండితెరపై సందడి చేయనుంది.
ఇదీ చదవండి: వారు పీకేతో కలిసి పనిచేసినా మాకేం అభ్యంతరం లేదు: కిషన్ రెడ్డి
'పార్టీలో చేరను.. మీ కోసం పని చేయను'.. కాంగ్రెస్కు పీకే ఝలక్!