వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డును అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర బృందం సందర్శించారు. యార్డులో సీసీఐ పత్తి కొనుగోలు తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. వాహనాలలో తీసుకొచ్చిన పత్తిని మాత్రమే సీసీఐ అధికారులు కొనుగోలు చేయడం బాధాకరమని వెల్లడించారు.
చిన్న, సన్నకారు రైతులు ఐదారు బస్తాలను వాహనంలో ఎలా తీసుకు వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం, సీసీఐ అధికారుల తీరు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యానికి, ప్రైవేట్ వ్యాపారులకు లాభం చేసేలా ఉన్నాయని ఏఐకెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పద్మ ఆరోపించారు. మార్కెట్ యార్డ్‌కు వచ్చిన ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: గాంధీ ఆస్పత్రిలో దిశ నిందితుల మృతదేహాలు