వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట్ మండలం టేకులగూడెంలో జంగా రాఘవ రెడ్డి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. జంగా రాఘవరెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ప్రత్యర్థి కావడం వల్లనే అక్రమ కేసులు పెట్టారని ఆయన అన్నారు. తెరాస నాయకులు పోలీసులను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
జంగా రాఘవ రెడ్డిపై పెట్టిన కేసులపై నిజ నిర్ధారణ చేసేందుకు పౌరసమాజంతో ఒక కమిటీని వేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాఘవరెడ్డిపై జరుగుతున్న దాడిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై బంద్‌కి పిలుపునిచ్చిన తెరాస...తర్వాత మద్దతు ఇస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నదని అన్నారు. కమలం, గులాబీ కలిసి వికసిస్తున్నట్లుగా ప్రస్తుత పరిణామాలున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : అడవిలో తల్లి, కుమారుడి దారుణ హత్య