వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నిన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటనలో తమ కార్యకర్తలపై పోలీసులు, తెరాస నాయకులు అక్రమంగా దాడి చేశారని ఆరోపిస్తూ కాళోజి కూడలి వద్ద ధర్నాకు దిగారు.
పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ విద్యార్థులపై లాఠీ చార్జీలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: 'వలస కూలీల ఖాతాల్లో నగదు జమ చేయాలి'