ETV Bharat / state

ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య - వరంగల్​ నేర వార్తలు

ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో జరిగింది. కమలాపూర్​కు చెందిన సాయిమనోజ్​ వసతి గృహంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

young man suicide due to love failure at hanmakonda
ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య
author img

By

Published : Jul 5, 2020, 4:54 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్​లో విషాదం జరిగింది. ప్రియురాలు తన ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సాయి మనోజ్ హన్మకొండలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్నాడు.

కొన్ని రోజులుగా హనుమకొండకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను ఆ యువతి అంగీకరించకపోవడం వల్ల మనస్తాపంతో వసతి గృహంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వసతి గృహ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు... మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు.

ఇవీ చూడండి: కంటోన్మెంట్​లోనూ ప్రభుత్వ పథకాల అమలు: తలసాని, మల్లారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.