ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం వివిధ రకాల పుష్పాలతో పూజలు చేసి అనంతరం నీమాత్రా క్రమంలో అలంకరించారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేయడం పూర్తిగా నిలిపివేశామని ఆలయ అర్చకులు వివరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా థర్మల్ స్క్రీనింగ్ చేశాక.. మాస్కులుంటేనే లోనికి అనుమతిస్తున్నారు.