వరంగల్ అర్బన్ జిల్లా దామెరలోని ఏకశిలా ప్రైమ్ పాఠశాలలో ఆరవ రాష్ట్ర స్థాయి సీనియర్ ఇంటర్ త్రో బాల్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. ఈ క్రీడల్లో బాలుర విభాగంలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలువగా... నిజామాబాద్ రెండవ స్థానం, వరంగల్ మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. బాలికల విభాగంలో హైదరాబాద్ మొదటి స్థానాన్ని వరంగల్ రెండవ స్థానాన్ని నిజామాబాద్ మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.
ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఏకశిల విద్యాసంస్థల ఛైర్మన్ శ్రీ గౌరు తిరుపతి రెడ్డి బహుమతులను అందించారు. ఏకశిలా ప్రైమ్ పాఠశాల అతిథ్యం ఇచ్చినందుకు రాష్ట్ర త్రో బాల్ అసోసియేషన్ తరఫున పాఠశాల యాజమాన్యాన్ని సత్కరించారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్‌ను వరించిన 'కోయిర్ కేరళ-2019' అవార్డు