వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామ శివారులో గల చెరువు కట్ట వద్ద మావోయిస్టు పార్టీ అనుబంధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ముగ్గుర్ని పోలీసుల అరెస్ట్ చేశారు. కాజీపేట ఏసీపీ రవీంద్ర వివరాలు వెల్లడించారు. ఉగ్గె శంకర్ అలియాస్ శేఖర్, గొల్లూరి ప్రవీణ్ కుమార్, కొత్తూరు ఇంద్రసేనా అలియాస్ సేన అలియాస్ చిన్నప్పలు మావోలకు అనుకూలంగా పనిచేస్తున్నారని తెలిపారు. ముగ్గురు నిందితులకు ఇదివరకే నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడించారు.
నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న 10 విప్లవ సాహిత్య పుస్తకాలు, 5 డైనమోలు, 4 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా యువతను చెడు దారిలో పయనించేలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సీఐ శ్రీనివాస్, ఎస్సై సూరి, ఎస్సై స్వప్నతోపాటు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.