వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఎంజీఎం కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన మరో ఇద్దరు వైరస్ బారిన పడ్డారు. హన్మకొండకు చెందిన ఓ యువకుడు, ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. కరోనా బారినపడి నగరానికి చెందిన ఓ వృద్ధుడు చనిపోయాడు.
వైరస్ సోకి ఎంజీఎం కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న కాజీపేటకి చెందిన వృద్ధుడిని హైదరాబాద్ గాంధీకి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతదేహాన్ని నేరుగా శ్మశాన వాటికకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఎంజీఎం కొవిడ్ వార్డులో పరిస్థితి విషమంగా ఉన్న మరో ముగ్గురినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు.