ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస, భాజపాలకు ఓటు అడిగే హక్కు లేదని యూత్ కాంగ్రెస్ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేశాయని ఆరోపించారు. ఆత్మకూరు మండల కేంద్రంలో పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండాల క్రాంతి ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం నియంత పాలన చేస్తోందని కొయ్యడ శ్రీనివాస్ ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన అమరులను, విద్యార్థుల పోరాటాలు మర్చిపోయి రౌడీయిజం ప్రోత్సహిస్తోందని విమర్శించారు. నిరుద్యోగులను, ఉద్యోగులను పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ఓటు అడుగుతారని ప్రశ్నించారు.
ఆయన చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వ హామీ మర్చిపోయారన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు మేకల అనిల్ యాదవ్, కచ్చకాయ క్రాంతి కుమార్, కుక్క రాజ్ కుమార్, దామెర యువజన అధ్యక్షుడు మన్యం ప్రకాష్ రెడ్డి, నాయకులు నరేష్, మల్లికార్జున్, ప్రదీప్, రాజు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నేడు నీతిఆయోగ్ భేటీ... రాష్ట్ర విజయాలు ప్రస్తావించనున్న సీఎం కేసీఆర్