ETV Bharat / state

సంక్షేమాన్ని ప్రజల దరి చేర్చాలి: కలెక్టర్ హరిత - ఉపాధి హామీ పథకం

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి అధికారి పని చేయాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా దామెర ఎస్సెస్సీ కన్వెన్షన్ హాల్​లో దామెర, ఆత్మకూరు మండలాలకు సంబంధించిన ఉపాధి హామీ, పల్లె ప్రగతి పనులపై కలెక్టర్​ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Wwarangal Rural Collector Review Meeting With Officers
ఉపాధి హామీ, పల్లెప్రగతి పనులపై కలెక్టర్​ సమీక్ష
author img

By

Published : Jul 4, 2020, 7:48 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా దామెర ఎస్సెస్సీ కన్వెన్షన్​ హాల్​లో జిల్లా కలెక్టర్​ హరిత ఉపాధి హామీ, పల్లె ప్రగతి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో కొనసాగుతున్న స్మశాసవాటిక, ప్రకృతివనం, డంపింగ్ యార్డుల నిర్మాణం పనుల ప్రగతిని తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ అడిగిన ప్రశ్నకు దామెర మండలం సింగరాజుపల్లి గ్రామ సర్పంచ్​ రజితకు బదులుగా ఆమె భర్త సత్యం సమావేశానికి హాజరై సమాధానం చెప్పగా.. కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేసి.. అతడిని బయటకు పంపించారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి.. గ్రామాల్లో పెండింగ్​లో ఉన్న పనులను జులై 20లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. వైకుంఠదామాల నిర్మాణాలు, ఆగస్టు చివరి నాటికి పూర్తిచేయాలన్నారు. ప్రతి గ్రామానికి సామాజిక మరుగుదొడ్లను మంజూరు చేశామని, వాటికి స్థలాలను ఎంపిక చేసి పనులను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. దామెర, ఆత్మకూరు మండలాలలో ఉపాధి కూలీల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని, ప్రజలకు అవగాహన కల్పించి కూలీల సంఖ్య పెంచాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేయకపోతే.. సర్పంచ్​, పంచాయతీ కార్యదర్శులను విధుల్లోంచి తొలగిస్తామన్నారు.

ఉపాధి కూలీల సంఖ్య తక్కువగా ఉండడంపై అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పని సిరుకుళ్ల, అక్కెంపేట, పులుపర్తి పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో రైతులు పల్లె ప్రకృతి వనం కోసం ధరఖాస్తు చేసుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో ఈజీఎస్ క్రింద కల్లాల నిర్మాణానికి దరఖాస్తులు వచ్చాయని, ఈ విషయంలో సర్పంచులు కృషిచేయాలన్నారు. నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు మంజూరయ్యాయని కలెక్టర్​ తెలిపారు.

ప్రభుత్వ స్థలాల్లో కల్లాలు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరగా.. ప్రభుత్వ స్థలాలు లేవని ఆమె స్పష్టం చేశారు. వర్షాలు బాగా కురుస్తున్నాయని.. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి ఇదే అనువైన సమయమని సూచించారు. ఈ సమావేశంలో సంపత్​రావు, డీపీవో నారాయణరావు, జెడ్పీటీసీ సీఈవో రాజారావు, ఎంపీపీలు శంకర్, సుమలత, జడ్పీటీసీలు కల్పన, రాధిక, డీఎల్పీవో కల్పన, ఎపీడీ వసునుతి, ఎంపీడీవోలు, వెంకటేశ్వర రావు, నర్మద, తహశీల్దారు రజనీ, ఎస్కే ముంతాబ్, ఎంపీపీ యాదగిరి, శారద, రాజారెడ్డి వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: తెలంగాణలో ఆకలి చావుల్లేవు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.