వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని దుర్గా మద్యం దుకాణం ముందు మహిళలు ధర్నా చేపట్టారు. జనావాసాల మధ్య మద్యం దుకాణం నిర్వహించడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళనకు దిగారు. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని, జనావాసాలకు దూరంగా తరలించాలని మహిళలు డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింప చేసే ప్రయత్నం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా అనుమతులు ఇవ్వడం వల్లనే తమకు ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు.
ఇదీ చూడండి : "రేపటి ఆర్టీసీ బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి"