వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాసదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు మరిన్ని అధికారాలు ఇస్తామన్నారు. రెవెన్యూ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని...అందువల్లనే ప్రక్షాళన దిశగా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి చందూలాల్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి : 'ఇంటర్ బోర్డు ఎదుట ధర్నా విజయవంతం'