వరంగల్ గ్రామీణ జిల్లా ప్రజాప్రతినిధులు తమ జిల్లా పరిధిలో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని కలిపి దానిని జిల్లా కేంద్రం చేయాలని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ స్పష్టం చేశారు. 2016లో జిల్లాల విభజన సమయంలో వరంగల్, హన్మకొండ జిల్లాలుగా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరామని తెలిపారు. కానీ కొన్ని పరిస్థితులతో దాన్ని అమలు చేయలేక గ్రామీణ, పట్టణ జిల్లాలుగా ఏర్పాటు చేశారని అన్నారు. తూర్పు కేంద్రంగా వరంగల్ జిల్లా ఏర్పాటు జరిగితే వరంగల్ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. గతంలో హన్మకొండ, వరంగల్ శాసనసభ్యులు వేరువేరుగా ఉండేవారని గుర్తు చేశారు.
ఇవీచూడండి: వరంగల్ గ్రామీణ, పట్టణ జిల్లాలకు కొత్తరూపు