వరంగల్ రూరల్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని.. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ సమస్యలపై మున్సిపల్ ఛైర్మన్ అంగోతు అరుణ, కమిషనర్ గొడిశాల రవిందర్, కౌన్సిలర్లతో చర్చించారు. పలు అభివృద్ధి పనుల గురించి అధికారులతో మాట్లాడారు. గ్రామ పంచాయితీగా ఉన్న సమయంలో వర్ధన్నపేట అభివృద్ధి చేయడం సాధ్యపడలేదని.. ఇప్పుడు మున్సిపాలిటీగా మారిన తర్వాత అభివృద్ధి చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అభివృద్ధి చేసేందుకు ఉన్న అన్ని సౌకర్యాలను వాడుకోవాలని అధికారులకు సూచించారు. చెరువు నుంచి వచ్చే నీరు పంట పొలాలకు రావాలంటే పట్టణంలో కొన్ని పైప్లైన్, పూడికతీత పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణంలో చేయాల్సిన రోడ్డు డివైడర్ పనులు, సెంట్రల్ లైటింగ్, అంబేద్కర్ జంక్షన్ అభివృద్ధికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలని.. అందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు, మున్సిపాలిటీ పాలకవర్గానికి సూచనలు చేశారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ కోసం మళ్లీ ప్లాస్మా దానం