ETV Bharat / state

రసాభాసగా నర్సంపేట మున్సిపాలిటీ వార్షికోత్సవ సమ్మేళనం - warangal latest news

వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మున్సిపల్ కౌన్సిల్ కమిటీ మొదటి వార్షికోత్సవం సమ్మేళనం రసాభాసగా ముగిసింది. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్దిపనులు ఎక్కడచేశారని నలుగురు కౌన్సిలర్లు నిలదీయటంతో వివాదం పెరిగింది.

Warangal Rural District Narsampet Municipal Council Committee First Anniversary Assembly concluded amicably
రసాభాసగా.. నర్సంపేట మున్సిపల్ మొదటి వార్షికోత్సవం సమ్మేళనం
author img

By

Published : Jan 28, 2021, 9:22 AM IST

వరంగల్ రూరల్‌ నర్సంపేట మున్సిపల్ కౌన్సిల్ కమిటీ మొదటి వార్షికోత్సవం సమ్మేళనం రసాభాసగా ముగిసింది. పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో అభివృద్ధి పనులపై చర్చ సాగింది.

అభివృద్ధి పనుల విషయమై..

సమావేశంలో ఛైర్ పర్సన్ గుంటి రజనీ కిషన్ కరోనా కారణంగా అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అభివృద్ధి పనులకు టెండర్లు జరిగాయని తొందరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ క్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ శీలం రాంబాబుతో పాటు మరోముగ్గురు కౌన్సిలర్లు అభివృద్దిపనులు ఎక్కడచేశారని నిలదీశారు. ఇది కాస్త వివాదంగా మారింది. తోటి కౌన్సిలర్లు ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్‌లు కలుగచేసుకుని కౌన్సిల్ సమావేశంలో చర్చించుకుంటే బాగుంటుందని గొడవను సద్దుమణిగేలా చేశారు.

ఇదీ చదవండి:ఈ బుద్ధుడి గురించి మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.