ETV Bharat / state

పరిశుభ్రతా స్కోర్​లో అగ్రస్థానంలో నిలిచిన వరంగల్​ రూరల్​ - పరిశుభ్రతా స్కోర్​లో టాప్​లో నిలిచిన వరంగల్​ గ్రామీణ జిల్లా

రాష్ట్రంలోని గ్రామపంచాయతీల పరిశుభ్రతా స్కోర్​లో వరంగల్ గ్రామీణ జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. మొత్తం 40 పాయింట్లకు గాను డిసెంబర్ నెలలో వరంగల్ గ్రామీణ జిల్లా 37.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

పరిశుభ్రతా స్కోర్​లో అగ్రస్థానంలో నిలిచిన వరంగల్​ రూరల్​

author img

By

Published : Jan 22, 2021, 9:42 AM IST

రాష్ట్రంలోని గ్రామపంచాయతీల పరిశుభ్రత స్కోర్‌లో వరంగల్ గ్రామీణ జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. 32 జిల్లాల్లోని పంచాయతీల్లో కొన్నింటిలో పరిశుభ్రతను పరిశీలించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతి నెలా జిల్లాల వారీగా సగటు స్కోర్​ను ఇస్తోంది. మొత్తం 40 పాయింట్లకు గాను డిసెంబర్ నెలలో వరంగల్ గ్రామీణ జిల్లా 37.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్ నెలలోనూ జిల్లా 38 పాయింట్లతో జిల్లా అగ్రస్థానంలోనే ఉంది.

డిసెంబర్ నెలలో 35.4 పాయింట్లతో రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో, 34.8 పాయింట్లతో నిజామాబాద్ మూడో స్థానంలో నిలిచాయి. 25.8 పాయింట్లతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చివరిస్థానానికి పరిమితమైంది. మొత్తం 32 జిల్లాలకు గాను ఆరు జిల్లాలు భూపాలపల్లి, కరీంనగర్, మంచిర్యాల, నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్ 30 పాయింట్లలోపు స్కోరులో ఉన్నాయి.

ఇదీ చూడండి: ప్రమాదం ఆ ఇంట నింపింది పెను విషాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.