Warangal-Khammam National High Way : వరంగల్ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి తొర్రూర్ మండలాల మీదుగా ఉన్న జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రమాదం జరగని రోజు లేదని స్థానికులు వాపోతున్నారు. రాయపర్తి మండల మైలారం శివారులోని వంతెన వద్ద రోడ్డు అధ్వాన్నంగా మారింది. లోడ్‌తో వెళ్తున్న వాహనాలు.. గుంతల్లో కూరుకుపోయి నిలిచిపోతున్నాయి. తాళ్ల సాయంతో వాహనాలను లాగుతూ ఇబ్బందులు పాడుతున్నారు.
శాశ్వత పరిష్కారమేది?
Warangal-Khammam National High Way Damage : రహదారి అధ్వాన్నంగా మారినా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. వరంగల్ -ఖమ్మం జాతీయరహదారిని బాగు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
క్షణంక్షణం.. భయంభయం..
Warangal-Khammam High Way Pits : "రోడ్లపై ఏర్పడిన గుంతలతో రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మార్గంలో వస్తే ప్రాణాలతో బయట పడతామా లేదోనని భయపడుతున్నాం. స్థానిక అధికారులు, ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేడు."
- వాహనదారులు
అయినా పట్టించుకోరే..
Warangal-Khammam Road Cracks : "గుంతలమయంగా మారిన రోడ్డుతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. నిత్యం ఏదో ఒక పని మీద ఈ రోడ్డుగుండానే రాకపోకలు సాగిస్తుంటాం. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు వాహనాలు త్వరగా పాడైపోతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును బాగు చేయాలి."
- వాహనదారులు