ETV Bharat / state

కాకతీయ యూనివర్సిటీ వార్షిక బడ్జెట్ రూ.332.92 కోట్లు - తెలంగాణ వార్తలు

కాకతీయ విశ్వవిద్యాలయం వార్షిక బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. రూ.332.92 కోట్లకు వార్షిక బడ్జెట్​ ఆమోదం పొందింది. దేశంలోనే అత్యున్నత నాణ్యత ప్రమాణాలే లక్ష్యంగా కృషిచేస్తున్నామని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్.మహేందర్ రెడ్డి తెలిపారు.

warangal kakatiya university budget of 2020-21
కాకతీయ యూనివర్సిటీ వార్షిక బడ్జెట్ రూ.332.92 కోట్లు
author img

By

Published : Mar 31, 2021, 10:25 AM IST

కాకతీయ యూనివర్సిటీ వార్షిక బడ్జెట్ రూ.332.92 కోట్లకు ఆమోదం పొందింది. కామర్స్ విభాగం డీన్​ వరలక్ష్మి పద్దును ప్రవేశపెట్టారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.90.94 కోట్లు కేటాయించిందని తెలిపారు. రెవెన్యూ రూ.214.15 కోట్లు లోటుగా చూపించారు. దీనిని అంతర్గత నిధుల నుంచి సమకూర్చుకోనున్నట్లు తెలిపారు. ఇతర వనరులు రూ.28.66 కోట్లు రానున్నాయి. అభివృద్ధి పనులకు రూ.13.09 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

అన్ని సేవలు ఆన్​లైన్​లోనే

దేశంలోనే అత్యున్నత నాణ్యత ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కాకతీయ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య మహేందర్ రెడ్డి తెలిపారు. ఆరు కోట్లతో కే-హబ్​ నిర్మిస్తున్నామని వెల్లడించారు. యూనివర్సిటీలో విద్యార్థుల ప్రవేశం నుంచి కోర్సు ముగిసేవరకు అన్ని సేవలను ఆన్​లైన్​లోనే నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి: '84 దేశాలకు 64 మిలియన్ల టీకా డోసులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.