వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో గాజుగాని రమేష్‌కు చెందిన జెర్సీ ఆవు కరెంటు షాక్‌కు గురై మృతి చెందింది. తన తల్లి విగతజీవిగా ఉండటాన్ని చూసి లేగదూడ తట్టుకోలేకపోయింది. దీనంగా తల్లి మృతదేహాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆవును తాకుతూ లేపేందుకు ప్రయత్నించింది. ఈ దృశ్యాన్ని చూసి రైతు దంపతులతోపాటు చుట్టుపక్కల స్థానికులు చలించిపోయారు. కన్నీళ్ల పర్యంతమయ్యారు.
ఇదీ చూడండి : పసిపాపపై హత్యాచారం కేసులో ముద్దాయికి ఉరిశిక్ష