ETV Bharat / state

నేడు ఓరుగల్లులో ఉపరాష్ట్రపతి పర్యటన - ఇవాళ వరంగల్​కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ వరంగల్​కు రానున్నారు. నగరంలో జరగనున్న ఆంధ్రా విద్యాభివర్ధిని(ఏవీవీ) విద్యాసంస్థల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హజరై ప్రసంగిచనున్నారు.

నేడు ఓరుగల్లులో ఉపరాష్ట్రపతి పర్యటన
నేడు ఓరుగల్లులో ఉపరాష్ట్రపతి పర్యటన
author img

By

Published : Feb 23, 2020, 5:16 AM IST

Updated : Feb 23, 2020, 7:58 AM IST

నేడు ఓరుగల్లులో ఉపరాష్ట్రపతి పర్యటన

ఇవాళ వరంగల్​కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. విద్యార్థులకు విద్యనందించి సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదిగేందుకు దోహదపడిన ఆంధ్రా విద్యాభివర్ధిని(ఏవీవీ) విద్యాసంస్థల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిచనున్నారు. నగరంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఏవీవీ విద్యాసంస్థలు @ 75 వసంతాలు

చారిత్రక నగరిలో ఎందరికో విద్యాదానం చేసి వారికి ఉన్నత భవిష్యత్‌ను ఇచ్చిన ఏవీవీ విద్యాసంస్థలు స్థాపించి నేటికి 75 వసంతాలు పూర్తయింది. స్వాతంత్రోద్యమ కాలంలో ఆచార్య చందా కాంతయ్య ముందుకొచ్చి నిజాం ప్రభువును ఒప్పించి తెలుగు మాధ్యమంలో పాఠశాలను ప్రారంభించారు.

క్రమశిక్షణ, నైతిక విలువలు

వేలాది మంది విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసిన విద్యాసంస్థలు క్రమశిక్షణ, నైతిక విలువలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఇక్కడ చదివినవారిలో ఎందరో వివిధ హోదాల్లో ఉన్నతస్థానంలో రాణిస్తున్నారు. విద్య వ్యాపారంగా మారిన కాలంలోనూ నాటి విలువలను కాపాడుతున్న ఏవీవీ విద్యాసంస్థలు ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయి.

మూడు రోజుల పాటు ఉత్సవాలు

వేలాది మందిని సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఏవీవీ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దాదాపు 5వేల మంది పూర్వ విద్యార్థులు ఉత్సవాలకు హాజరుకానున్నారు. మూడున్నర కోట్ల వ్యయంతో అల్యుమినీ బ్లాక్ నిర్మించనున్నారు. మూడు రోజుల పాటు జరగునున్న ప్లాటినం జుబ్లీ ఉత్సవాల్లో విద్యాసదస్సులు, చర్చా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి: కొత్త జీహెచ్​ఎంసీ చట్టంపై మంత్రి కేటీఆర్ సమీక్ష

Last Updated : Feb 23, 2020, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.