ETV Bharat / state

గులాబీ పార్టీకే పట్టం కట్టిన పట్టణ ఓటర్లు - ఉమ్మడి  వరంగల్ జిల్లా వార్తలు

ఉమ్మడి  వరంగల్ జిల్లాలో పట్టణ ఓటర్లు గులాబీ పార్టీకే పట్టం గట్టారు. కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులను చిత్తు చేసి... పురపాలికల్లో కారును పరుగులు పెట్టించారు. మొత్తం 9 పురపాలికల్లో 8 మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాలు తెరాస వశమైయ్యాయి. జనగామలో పీఠం కైవసం చేసుకునేందుకు అవసరమైన మెజార్టీ ఎవరికీ రాలేదు.  జిల్లాలో 182 వార్డుల్లో కాంగ్రెస్​కు 33, భాజాపాకు 10 దక్కాయి.

Urban voters who are crowned the rose party warangal district
గులాబీ పార్టీకే పట్టం కట్టిన పట్టణ ఓటర్లు
author img

By

Published : Jan 25, 2020, 11:36 PM IST

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన పురపోరులో తెరాస విజయబావుటా ఎగరేసింది. మెజార్టీ వార్డులను గెలుచుకోవడం ద్వారా 8 ఛైర్మన్ పీఠాలను అధికార పక్షమైన తెరాస అవలీలగా కైవసం చేసుకుంది. జిల్లాల వారీగా చూస్తే మహబూబూబాద్ జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు పురపాలికల్లో కారు పరుగులు పెట్టింది. మరిపెడలో ‍ఒక్క వార్డూ కూడా విపక్షాలకు దక్కలేదు.

మహబూబాబాద్‌లో కారు పరుగు
మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో తెరాస 19 వార్డుల్లో గెలువగా కాంగ్రెస్‌ 10 వార్డులను కైవసం చేసుకుంది. సీపీఎం, సీపీఐ రెండేసి వార్డుల చొప్పున గెలవగా, స్వతంత్రులు మూడు వార్డుల్లో గెలిచారు. మరిపెడలో మరో పార్టీకి అవకాశం ఇవ్వకుండా తెరాస అన్ని వార్డులను కైవసం చేసుకొని తన సత్తా చాటింది. 15 వార్డులకు 15 సాధించి తెరాసకు ఎదురు లేదని చాటింది. డోర్నకల్‌లో మొత్తం 15 వార్డులకుగాను 11 వార్డులను అధికార పక్షం దక్కించుకొని పురపాలికపై గులాబీ జెండాను ఎగురవేసింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 1, స్వతంత్రులకు మూడు వార్డులు దక్కాయి. తొర్రూరులోని 16 వార్డులకు 12 వార్డులు తెరాస గెలుచుకుని, పట్టణంలో తమకు ఎదురు లేదని చాటింది. ఇక్కడ కాంగ్రెస్​కు 3, భాజపా ఒక వార్డులో గెలుపొందాయి.

కేసీఆర్, కేటీఆర్​ల కృషి వల్లే
తెరాస అభ్యర్థుల ఘనవిజయంతో మహబూబాబాద్ జిల్లాలో సంబురాలు అంబరాన్ని తాకాయ్. కేసీఆర్, కేటీఆర్​ల చిత్రపటానికి మంత్రి ఎర్రెబెల్లి దయాకరరావు పాలాభిషేకం చేశారు. అభ్యర్ధుల వ్యతిరేకతోనే కొన్ని వార్డుల్లో కాంగ్రెస్, భాజాపాలు గెలిచాయ్ తప్ప తెరాసపై వ్యతిరేకతతో కాదని అన్నారు.

వరంగల్ గ్రామీణ జిల్లాలో కారుకు పోటీ
వరంగల్ గ్రామీణ జిల్లాలోని 3 పురపాలికలూ తెరాసకే దక్కాయ్. నర్సంపేట, పరకాల, వర్దన్నపేట మున్సిపాలిటీల్లో కారు జోరు కొనసాగింది. నర్సంపేట పురపాలికలోని 24 వార్డుల్లో 16 గులాబీ పార్టీ దక్కించుకోగా, 6 వార్డులను కాంగ్రెస్‌ కైవసం చేసుకుని రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ రెండు వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు. 11 వార్డులను ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా పరకాల ఎన్నికను లాంఛనం చేసిన తెరాస. మొత్తం 17 వార్డులను గెలుపొందింది. భాజాపా ఇక్కడ మూడు వార్డులను గెలుచుకోగా, కాంగ్రెస్‌ 1, ఎఐఎఫ్‌బీ 1 గెలుచుకున్నాయి. ఇక వర్దన్నపేటలో 8 వార్డుల్లో తెరాస అభ్యర్ధులే జయకేతనం ఎగరేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు రెండు చోట్లా, భాజపా , స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్క వార్డులోనూ గెలుపొందారు.

నృత్యాలు చేస్తూ సంబురాలు
గెలుపొందిన అభ్యర్థులకు రిటర్నింగ్‌ అధికారులు గెలుపు ధృవీకరణ పత్రాలు అందజేశారు. తెరాస విజయపథాన సాగడం వల్ల ఆ పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలతో బాణసంచా కాల్చారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలు వేసి, కార్యకర్తలతో కలసి నృత్యాలు చేస్తూ సంబురాల్లో పాలుపంచుకున్నారు.

Urban voters who are crowned the rose party warangal district
మున్సిపాలిటీల వారీగా పార్టీలు గెలిచిన వార్డుల స్థానాలు

తల్లిని గెలిపించిన తనయుడు
వర్ధన్నపేట మున్సిపాలిటీలో 5వ వార్డులో తల్లిని తనయుడే గెలిపించడం విశేషం. తెరాస టిక్కెట్ లభించకపోవడంతో... స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేసిన అనిత, తెరాస అభ్యర్థిని కన్నా....ఒక్క ఓటు అదనంగా పొంది...విజయం సాధించారు. వరుసకు కొడుకైయ్యే ఉద్యోగి తిరుపతి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా అనితను గెలిపించారు.

భూపాలపల్లిలో గులాబీ పీఠం
మొత్తం 30 వార్డులకు గాను 23 దక్కించుకుని భూపాలపల్లి పురపాలిక పీఠాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ భాజాపా ఒక్క వార్డులో గెలుపొందగా, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు మూడు వార్డుల్లో గెలుపొందారు. సీపీఐ రెండు చోట్లా, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

ఆసక్తి రేపిన జనగామ పురపోరు
ఆసక్తి రేపిన జనగామ పురపోరులో ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునే స్పష్టమైన ఆధిక్యత ఎవ్వరికీ రాలేదు. తెరాసకు మొత్తం 13 వార్డులు దక్కగా..కాంగ్రెస్ 10 వార్డుల్లో పైచేయి సాధించింది. భాజాపా అభ్యర్థులు 4 వార్డుల్లో విజయం సాధించారు. స్వతంత్రుల మద్దతుతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని తెరాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, భాజాపాలు పరస్పరం సహకరించుకుంటూ.. ఇదే వ్యూహంతో ముందుకెళ్తమంటున్నారు.

గులాబీ పార్టీకే పట్టం కట్టిన పట్టణ ఓటర్లు

ఇదీ చూడండి : 'అధికారులు సక్కగుంటే.. పెట్రోల్ తీసుకుని ఎందుకొస్తరు'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.