TSNPDCL CMD Gopala Rao instructions: హనుమకొండలో విద్యుత్ బిల్లులు పెరుగుపోతున్నాయని ఆందోళన చెందుతున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయంలో సీఎండీ అన్నమనేని గోపాలరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన తెలిపిన వివరాలు.. విద్యుత్ నియంత్రణా మండలి ఆదేశాల మేరకే గత సంవత్సరం వినియోగించిన రెండు నెలల సగటు విద్యుత్ యూనిట్లకు సంబంధించి డిపాజిట్ వసూలు చేయడం జరుగుతోందని టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు అన్నారు. అదనపు వినియోగ డిపాజిట్ బిల్లల చెల్లింపులో ఎవరినీ ఇబ్బందుల పాలు చేసే ఉద్దేశ్యం సంస్ధకు లేదని అన్నారు. వంద యూనిట్లు వినియోగించేవారే 61 శాతం ఉన్నారని వీరు నామమాత్రంగానే చెల్లించాలని తెలిపారు.
కేవలం 15 శాతం వారి పైన కొంత భారం ఉంటుందని తెలిపారు. ఈ డిపాజిట్‌పై ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం వడ్డీ లెక్కించి బిల్లుల్లో సర్దుబాటు చేయడం జరుగుతుందని దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మరింత మెరుగైన రీతిలో సేవలందించేందుకు వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
"సంస్థ సొంతగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం లేదు. ఆర్బీఐ నిబంధనలు మేరకే వాటిని అమలు పరుస్తున్నాం. రెగ్యులేషన్ ఆఫ్ 2004 ప్రకారం వినియోగదారులు ఉపయోగించిన బిల్లుకు సగటున 2 నెలలు డిపాజిట్ ఉంటుంది. వినియోగదారులకు 0-100, 100-200 మధ్య యూనిట్లు వచ్చే వారికి పెద్దగా సమస్య ఏమి లేదు. సమస్య ఎక్కడంటే 200-300యూనిట్లు మధ్య వచ్చే వినియోగదారులకే. ఇప్పటికే కొంత మంది వినియోగదారులు ఎవరైతే 300 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చే వాళ్లు నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులు చేస్తున్నారు. 200-250 యూనిట్ల మధ్య ఉన్న వినియోగదారులు కేవలం పది శాతం. 250-300 మధ్య 4 శాతం ఉన్నారు. మెుత్తంగా ఈ భారం 15 శాతం వినియోగదారులపై పడుతోంది. ఏమైనా సందేహాలు ఉంటే అధికారిక వెబ్సైట్లో చూసుకోవల్సిందగా తెలియజేస్తున్నాను." - అన్నమనేని గోపాలరావు, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ
సీఎండీకి అధికారుల వినతి: టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న విద్యుత్తు ఇంజినీర్ల పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఇంజినీర్ల సంఘం నేతలు ఆదివారం సీఎండీ అన్నమనేని గోపాలరావును కలిసి వినతి పత్రం అందించారు. మార్యాదపూర్వకంగా ఇంజినీర్లు సీఎండీని సత్కరించారు. కంపెనీ పురోగతి, ఉద్యోగుల పదోన్నతులు, ఇతర అంశాలపై చర్చించి వాటిని పరిష్కరించాలని కోరారు.
ఇవీ చదవండి: