ETV Bharat / state

200 కుటుంబాలకు తెరాస యువనాయకుల సాయం - వరంగల్ గ్రామీణ జిల్లా తాజా వార్తలు

లాక్​డౌన్​ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల కూలీలకు సాయం అందిచేందుకు పలు చోట్ల దాతలు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో 200మంది కూలీలకు తెరాస యువనాయకులు సరకులను పంపిణీ చేశారు.

trs youth help 200 families in narsampet warangal
200 కుటుంబాలకు తెరాస యువనాయకుల సాయం
author img

By

Published : Apr 16, 2020, 10:33 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో తెరాస యువనాయకులు నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. నర్సంపేట మూడో వార్డులోని ఎస్సీ కాలనీలో సుమారు 200 మంది కూలీల కుటుంబాలకు సాయం అందించారు. నర్సంపేట ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి, వర్ధన్నపేట ఎంఎల్ఏ ఆరూరి రమేష్​లు కలిసి సరకులు వితరణ చేశారు.

సరకులను అందించడానికి ముందుకొచ్చిన దాతలను వారు అభినందించారు. రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోయాయని వాటిని పెంచడం కోసం రేపటి నుంచి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. నర్సంపేట నియోజక వర్గం నుంచి నాలుగువేల ప్యాకెట్లను ప్రభుత్వానికి అందించడాని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందుకోసం యువత ముందుకు రావాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏలతో పాటు మున్సిపల్ ఛైర్​పర్సన్ గుంటి రజని, రాణాప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : ఐకేఆర్​ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.